హోంమంత్రిగా విజయశాంతి? | Vijayasanthi As Home Minister.. ? | CM Revanth Reddy | Congress | RTV
సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
TG: బీఆర్ఎస్ ఇక ఉండదు అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని బీఆర్ఎస్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో ఆమె త్వరలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతారనే చర్చ రాజకీయాల్లో మొదలైంది.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు విజయశాంతి. వీరి ఆటలో జనాలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులే పిచ్చోళ్లయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పంపిన ఓ నాయకుడి వల్లే బండి సంజయ్ పదవి పోయిందని ఆరోపించారామె. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్నందునే ఆ పార్టీని వీడానన్నారు.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్లగా ముందుగా విడుదల చేసిన జాబితాలో విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్లు లేవు. అయితే తాజాగా ఈ ఇద్దరిని స్టార్ క్యాంపెయినర్లగా బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అన్ని పార్టీలు కొత్త ఎత్తుగడలతో ముందుకి వెళుతున్నాయి. అయితే బీజెపీలో మాత్రం అసంతృప్తి బలంగా ఉందని...రెబల్స్ బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఆపరేషన్ బీజెపీ అసమ్మతి పేరుతో అసంతృప్త నేతలను తమ పార్టీలోకి లాగుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.