Kingdom: అదిరిపోయింది భయ్యా.. విజయ్‌ దేవరకొండకు కింగ్‌డమ్‌తో హిట్‌ పడ్డట్లేనా ?

విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్‌డమ్‌ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

New Update
Vijay Devarakonda Kingdom Trailer Released

Vijay Devarakonda Kingdom Trailer Released

విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్‌డమ్‌ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్‌ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. 

Also Read: మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తకు విషం పెట్టి చంపిన భార్య

ఇటీవల కింగ్‌డమ్ బాయ్స్ అంటూ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, విజయ దేవరకొండతో కలిసి మరో ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా పాడ్‌కాస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరలవుతోంది. మరోవైపు విజయ్‌ దేవరకొండ ఈ మధ్య చేసే సినిమాలు ఫ్లాప్, లేదా యావరేజ్‌ మాత్రమే అవుతున్నాయి. మరి కింగ్‌డమ్ సినిమాతో విజయ్‌ దేవరకొండ ఇప్పుడైన హిట్‌ కొడతాడో లేదో చూడాలి. 


Advertisment
తాజా కథనాలు