Venu Swamy: ప్రభాస్, దేవరకొండ, సమంత సూసైడ్ పక్కా.. వేణు స్వామి సంచలన ఆడియో లీక్!

వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత ముగ్గురు సెల‌బ్రిటీలు చనిపోతారని చెప్పిన ఆడియో వైరల్‌గా మారింది. అందులో విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడని అన్నట్లు వినిపిస్తుంది. దీంతో వేణుస్వామిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

New Update
venu swamy

Venu Swamy

సెలబ్రిటీ జోతిష్యుడిగా వేణుస్వామి బాగా పాపులర్ అయ్యాడు. హీరో, హీరోయిన్స్‌ పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి జోష్యం చెప్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతడు నాగచైతన్య, సమంత విడాకుల అంశంతో సంచలనంగా మారాడు. అదే సమయంలో ఎన్నో విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత మరెంతో మందిపై జోష్యం చెప్పి వివాదాల్లో చిక్కుకున్నాడు. 

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవలే నాగ చైతన్య, శోభిత మ్యారేజ్ చేసుకోగా.. అప్పుడు కూడా తన జోష్యం చెప్పి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ దారుణమైన కామెంట్స్ చేయడంతో నెట్టింట అభిమానులు, సినీ ప్రియులు అతడిపై మండిపడ్డారు. ఫిలిం జర్నలిస్టులు సైతం వేణుస్వామిపై కంప్లైంట్ చేశారు. కానీ అతడు వెనక్కి తగ్గకుండా సెలబ్రిటీల గురించి కామెంట్స్ చేస్తున్నాడు. 

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

ముగ్గురు సెలబ్రిటీలు సూసైడ్

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు సెలబ్రిటీలు సూసైడ్ చేసుకుంటారని వేణుస్వామి చెప్పిన ఆడియో నెట్టింట సంచలనంగా మారింది. ఓ జర్నలిస్టుతో వేణుస్వామి మాట్లాడిన ఆడియో లీక్ అయి హాట్ టాపిక్‌గా మారింది. అతడి ఆడియో ప్రకారం.. ‘‘నేను ముగ్గురు సెలబ్రిటీలు చనిపోతారని చెప్పాను. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతారు. మరొకరు సూసైడ్ చేసుకుంటారు. నా లెక్క ప్రకారం.. విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడు. బయటకు రావడానికి కాస్త టైం పడుతుంది. 

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

ఒక హీరోకి సీరియస్ ఇంజ్యూరి ఉంటుంది. అతడికి అన్నీ సమస్యలే. మీడియాకి ఎవరికీ ఏం చెప్పలేదు. మేనేజ్ చేస్తున్నారు. అందుకే రాజాసాబ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఆ సినిమా సెప్టెంబర్‌కు పోయింది. ఇవన్నీ ముందు ముందు జరగబోతున్నాయి. అన్నీ అయిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో అభిమానులు వేణుస్వామిపై చిర్రెత్తిపోతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు