Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌తో రాశి ఖన్నా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' పై అదిరిపోయే అప్‌డేట్

రాశీ ఖన్నా, పవన్ కళ్యాణ్‌తో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ పూర్తి చేశారు. పవన్‌తో పని చేయడం గొప్ప గౌరవమని, ఇది గుర్తుండే అనుభవమని చెప్పారు. ప్రస్తుతం రాశీ "తెలుసు కదా" సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ వేగంగా సాగుతోంది. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా(Rashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్‌ పూర్తి చేసిన రాశీ ఖన్నా, పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేయడం గురించి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం రాశీ ఖన్నా సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఇది ఒక గుర్తుండిపోయే అనుభవం. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం నాకు గొప్ప గౌరవం. ఇది ఎప్పటికీ గుర్తుండే మధుర జ్ఞాపకం." అని పేర్కొన్నారు. తన పోస్టులో, పవన్ కళ్యాణ్‌తో కలిసి తీసుకున్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

పోస్ట్ లో, "ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌కు ముగింపు. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం" అని ఆమె క్యాప్షన్‌ పెట్టింది. 

Also Read: Horror Movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ మూవీ! ఒక్క సీన్ కూడా వదలరు!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు, ఒకటి OG, మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్. OG సినిమా సూజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా కాగా, అది 2025 సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాను కూడా త్వరలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పవన్ బిజీగా పని చేస్తున్నారు.

రాశీ ఖన్నా ఇప్పటికే జై లవ కుశా, తొలి ప్రేమ, సుప్రీమ్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో పెద్ద సినిమా "తెలుసు కదా", ఇందులో ఆమెకు జోడీగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై కూడా మంచి బజ్‌ ఉంది.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

"ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాపై  అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌క లో రాశీ ఖన్నా పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు