Horror Movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ మూవీ! ఒక్క సీన్ కూడా వదలరు!

థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా.. ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది 'బకాసుర రెస్టారెంట్'. స్ట్రీమింగ్ కి వచ్చిన మూడు రోజుల్లోనే ఇండియాలోని  టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో 5 వ స్థానంలో నిలిచింది. 

New Update

Horror Movie: థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా.. ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. స్ట్రీమింగ్ కి వచ్చిన మూడు రోజుల్లోనే ఇండియాలోని  టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో 5 వ స్థానంలో నిలిచింది.  మరి ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ సినిమా పేరు 'బకాసుర రెస్టారెంట్'.  ప్రవీణ్, వైవా హర్ష, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, షైనింగ్ ఫణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 8న థియేటర్స్ లో విడుదలైంది. కానీ, థియేటర్స్ లో ఈ చిత్రాన్ని  పెద్దగా  ఆదరించలేదు ప్రేక్షకులు. థియేటర్స్ లో మిస్సయినా ఓటీటీలో ఈ సినిమా మంచి ఆధరణ లభించింది. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ ప్లాట్ ఫార్మ్స్ లలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఓటీటీలోని టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో 5వ స్థానంలో నిలిచింది.  హారర్, కామెడీ సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎస్.జె. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మాతలుగా వ్యవహరించారు. 

Also Read: Salman Khan: లఢఖ్ గవర్నర్ తో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భేటీ.. కారణం అదేనా ?