Marco Movie: 'మార్కో 2' క్యాన్సిల్! ఉన్ని ముకుందన్ షాకింగ్ నిర్ణయం!

హీరో ఉన్నిముకుందన్ 'మార్కో' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. "క్షమించండి, మార్కో సిరీస్‌ను కొనసాగించే ఆలోచనను విరమించుకున్నాను అని తెలిపారు. మార్కో సినిమాలోని హింసాత్మక సన్నివేశాలపై విమర్శల కారణమగానే సీక్వెల్ ప్లాన్ విరమించుకున్నట్లు తెలుస్తోంది.

New Update

Marco Movie:  మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా ఇటీవలే విడుదలైన  'మార్కో' సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ..  బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటే బాగుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

సీక్వెల్ లేదు! 

ఈ క్రమంలో తాజాగా ఉన్నిముకుందన్ చేసిన పోస్ట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే ఒక అభిమాని సోషల్ మీడియాలో  "మార్కో 2 ఎప్పుడు వస్తుంది?" అని అడగగా.. దానికి ఉన్ని ముకుందన్ షాకింగ్ సమాధానం చెప్పారు. "క్షమించండి, మార్కో సీక్వెల్ తీసే ఆలోచనను విరమించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ చుట్టూ చాలా నెగెటివిటీ ఉంది. మార్కో కంటే పెద్దది, మెరుగైన సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ ప్రేమకు, సానుకూలతకు ధన్యవాదాలు" అంటూ బదులిచ్చారు. 

unni mukundan on marco sequel
unni mukundan on marco sequel

హింసపై విమర్శలు

అయితే 'మార్కో' సినిమా విడుదలైన తర్వాత, అందులోని తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలపై విమర్శలు వెలువెత్తాయి. సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయకుండా నిషేధించింది. దీంతో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉన్నిముకుందన్ సీక్వెల్ ఆలోచనను విరమించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

Also Read:Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

ఇదిలా ఉంటే  ప్రస్తుతం ఉన్ని ముకుందన్ 'గంధర్వ జూనియర్' అనే పాన్-ఇండియా చిత్రం చేస్తున్నారు. దీంతో పాటు తెలుగులో పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అలాగే ఓ సూపర్ హీరో కథతో దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

Advertisment
తాజా కథనాలు