PM Modi Biopic: 'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘మా వందే’ పేరుతో ఓ కొత్త బయోపిక్ రాబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోదీగా ఉన్ని ముకుందన్ నటించనున్నారు, దింతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

New Update
PM Modi Biopic

PM Modi Biopic

PM Modi Biopic: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జీవితం ఆధారంగా మరోసారి బయోపిక్ రూపొందనుంది. ఈసారి ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో, అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘మా వందే’ అనే శీర్షికను ఖరారు చేశారు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

ఈ సినిమానలో ఉన్ని ముకుందన్(Unni Mukundan) ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. తెలుగు ప్రేక్షకులకు ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘యశోద’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన ఉన్ని ముకుందన్, ఇప్పుడు దేశ ప్రధానిగా మోదీ పాత్రను పోషించబోతున్నాడు.

ఈ బయోపిక్‌లో నరేంద్ర మోదీ జీవితంలో చిన్ననాటి నుంచి మొదలుకుని, దేశ ప్రధానిగా ఎదిగిన దాకా జరిగిన ముఖ్య ఘట్టాలన్నింటినీ చూపించనున్నారు. ముఖ్యంగా ఆయన తల్లి హీరాబెన్ మోదీ అనుబంధం, ఆమె మోదీ జీవితం మీద చూపిన ప్రభావాన్ని ఈ సినిమాలో ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

ఈ బహుభాషా ప్రాజెక్ట్‌ను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలు క్రాంతి కుమార్ సిహెచ్ వహించనున్నారు.

స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ తో, ఎంతో భారీగా తెరకెక్కబోతోంది ఈ సినిమా..

సినిమాటోగ్రఫీ: బాహుబలి సినిమాకు పనిచేసిన కేకే సెంథిల్ కుమార్

సంగీతం: KGF ఫేం రవి బస్రుర్

ఎడిటింగ్: జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైన్: ప్రముఖ డిజైనర్ సాబు సిరిల్

యాక్షన్ కొరియోగ్రఫీ: కింగ్ సొలమన్

Also Read:"మహేష్ బాబును అడగగలరా?" జర్నలిస్ట్‌పై లక్ష్మీ మాంచు ఫైర్..

ఇవే కాకుండా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గంగా‍ధర్ ఎన్.ఎస్., వాణిశ్రీ బీ., లైన్ ప్రొడ్యూసర్ టీవీఎన్ రాజేష్, కో-డైరెక్టర్ నరసింహారావు ఎం. లాంటి అనుభవజ్ఞుల బృందం ఈ చిత్రంతో కలిసి పని చేస్తోంది.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల

ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అంటే ఇది నిజంగా పాన్-ఇండియా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడానూ తెరకెక్కబోతోంది. ఇది ఒక సాధారణ బయోపిక్ కాదని, ప్రేరణనిచ్చే జీవన గాథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మేకర్స్ లక్ష్యం అని తెలుస్తోంది.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

గతంలో 2019లో వచ్చిన ‘PM Narendra Modi’ అనే బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు 'మా వందే' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు కొత్త కోణంలో మోదీ జీవితాన్ని పరిచయం చేయబోతోంది.

‘మా వందే’ అనే ఈ బయోపిక్, నరేంద్ర మోదీ జీవితాన్ని ప్రామాణికంగా, భావోద్వేగంగా, వాస్తవికంగా చూపించేందుకు దర్శక బృందం నిశ్చయించింది. ఉన్ని ముకుందన్ లాంటి టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన రావడం మరింత స్పెషల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు