/rtv/media/media_files/2025/01/31/ITuttYT0LNjoo0byyrqc.jpg)
Marco Movie Streaming On Ott Platform sonyliv FROM February 14
Marco Movie OTT: మార్కో మూవీ.. ఈ మధ్యన గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. హనీఫ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించి అదరగొట్టేశాడు. గతేడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు బద్దలు కొట్టింది.
మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ రావడంతో తెలుగులో రిలీజ్ చేశారు. గతేడాది డిసెంబర్ 31న తెలుగులో రిలీజ్ అయింది. ఇక ఇక్కడ కూడా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఇలా భారీ రెస్పాన్స్‌తో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. .
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది... ..!
రూ.100 కోట్ల కలెక్షన్లు
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బుర్రలు పట్టేసుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫిదా అయిపోయారు. దీంతో ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టి అబ్బురపరచింది. ఇలా థియేటర్లలో ఉర్రూతలూగించిన ‘మార్కో’ ఇప్పుడు ఓటీటీలో తన మార్క్ చూపించడానికి సిద్ధమైంది.
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
ఓటీటీలోకి మార్కో
#Marco will be live for streaming from February 14 via @SonyLIV pic.twitter.com/Apx5939rDB
— Friday Matinee (@VRFridayMatinee) January 31, 2025
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి14 నుంచి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు.. తర్వాలో ఇంటివద్దనే చూసేయొచ్చు. . . .