BIG BREAKING: DMK పార్టీలో చేరిన పన్నీర్‌ సెల్వం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.

New Update
panner selvam

panner selvam

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు. ఈ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత మాజీ సీఎం జయలలితకు సెల్వం నమ్మిన బంటుగా ఉండేవారు. మూడుసార్లు ఆయన సీఎంగా పనిచేశారు. అయితే 2022లో సెల్వం, ఆయన అనుచరులను AIDMK బహిష్కరించింది.   

Also read: పోలీసులకు లొంగిపోతానన్న మావోయిస్టు హత్య

డీఎంకేలో చేరిన సందర్భంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తన తల్లి సంస్థలోకి మళ్లీ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. AIDMK జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన అహంకారం వల్లే ఏఐడీఎంకే బలహీనపడిందంటూ విమర్శలు చేశారు. మరో రెండు నెలలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన పార్టీ మారడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయనతో పాటు తన ప్రధాన అనుచరులు, ఎమ్మెల్యే అయ్యప్పన్, మరికొందరు కీలక నేతలు కూడా డీఎంకేలో జాయిన్ అయ్యారు. అయితే డీఎంకే పార్టీ తరఫున పన్నీర్ సెల్వం థేని జిల్లాలోని  బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు