TN Stampede: విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన మెగాస్టార్.. ట్వీట్ వైరల్!

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.  తమిళనాడులోని కరూర్‌ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

New Update
Vijay ralley

Vijay ralley

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌(tvk vijay speech) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి(megastar-chiranjeevi) స్పందించారు.  తమిళనాడులోని కరూర్‌ ర్యాలీ(Karur stampede) లో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. 

38కి పైగా మృతుల సంఖ్య

చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం. అలాగే సుమారు 65 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ర్యాలీ నిర్వహించిన టీవీకే చీఫ్ విజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా  ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Also Read: TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితుల కుటుంబానికి విజయ్‌ ఎక్స్‌గ్రేసియా

తొక్కిసలాటకు కారణాలు?

అయితే ఈ తొక్కిసలాట ఘటనకు మూడు ప్రధాన కారణాలని తెలుస్తోంది. మొదటి కారణం.. ఊహించిన దానికంటే ఎక్కువ మంది ర్యాలీలో పాల్గొనడం! ఈ ర్యాలీకి కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకోగా.. దాదాపు 30,000 నుంచి 60,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆ తర్వాత రెండవ కారణం విజయ్ రావడమని తెలుస్తోంది.  మొదట విజయ్  మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించారు. కానీ, ఆయన దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీనివల్ల ఆ ప్రదేశానికి మరింత మంది అభిమానులు చేరుకొని ఆయన కోసం ఎదురుచూశారు.  విజయ్ ప్రసంగిస్తుండగా.. కొందరు ఒక్కసారిగా ఆయన సమీపంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో జనం మధ్య తోపులాట, గందరగోళం చెలరేగి తొక్కిసలాటకు దారితీసిందని సమాచారం. కొందరు ఒక బాలిక కనిపించలేదనే వార్తతో వెతుకుతూ ఒకే దిశగా వెళ్లడం కూడా తొక్కిసలాటకు కారణమైందని పలు  నివేదికలు తెలిపాయి. జన సమూహాన్ని నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత కూడా తొక్కిసలాటకు మరో ప్రధాన కారణమని సమాచారం.

Advertisment
తాజా కథనాలు