CINEMA: ఊహించని ట్విస్ట్! హీరోగా  మారిన డైరెక్టర్..  నిర్మాతగా సౌందర్య రజినీకాంత్!

 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ నిర్మిస్తున్న కొత్త సినిమాతో హీరోగా అలరించేందుకు సిద్దమయ్యాడు.

New Update
Abhishan Jeevinth

Abhishan Jeevinth

Abhishan Jeevinth:తొలి సినిమాకే స్టార్ డైరెక్టర్ ఇమేజ్ దక్కించుకునే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు.  అందులో కుర్ర డైరెక్టర్ అభిషన్ జీవంత్(Abhishan Jeevinth) ఒకరు!  'టూరిస్ట్ ఫ్యామిలీ'(Tourist Family) అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ తొలి సినిమాకే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.   శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన ఓ కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఇదొక సింపుల్ ఫ్యామిలీ స్టోరీ అయినప్పటికీ..  అభిషన్ తన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని కట్టిపడేసాడు.  దీంతో అభిషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

Also Read :  వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్.. వైరల్ అవుతున్న వీడియో!

హీరోగా మారిన దర్శకుడు

ఇప్పుడాయన  దర్శకుడిగా కాకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ నిర్మిస్తున్న కొత్త సినిమాతో హీరోగా అలరించేందుకు సిద్దమయ్యాడు.  తాజాగా వినాయకచవితి సందర్భంగా #PRNO04'' అనే వర్కింగ్ టైటిల్ తో  ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని..  సౌందర్య రజినీకాంత్ జియాన్ పిక్చర్స్,  ఎంఆర్పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అభిషన్ జీవంత్ జోడీగా మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఆమెకు తమిళంలో రెండవ సినిమా.

ఇందులో అనస్వర మోనిష పాత్రలో నటిస్తుండగా.. అభిషన్ సత్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు  సీన్ రోల్డన్ సంగీతం అందిస్తుండగా,  శ్రేయాస్ కృష్ణ  సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.  దర్శకుడిగా తొలి సినిమాతో హిట్టు కొట్టిన అభిషన్.. ఇప్పుడు హీరోగా మారి సౌందర్య రజినీకాంత్ నిర్మాణంలో సినిమా చేయడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Also Read: NC24: నాగ చైతన్యకి విలన్ గా 'లాపతా లేడీస్' హీరో.. ''NC24'' నుంచి పిచ్చెక్కించే అప్డేట్!

Advertisment
తాజా కథనాలు