/rtv/media/media_files/2025/08/28/sparsh-shrivastava-2025-08-28-15-35-04.jpg)
Sparsh Shrivastava
అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya NC24) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చై కెరీర్ లో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా తండేల్ రికార్డు క్రియేట్ చేసింది. ఇదే జోష్ లో తన నెక్స్ట్ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు అక్కినేని హీరో. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం "NC24 – The Excavation Begins"అంటూ ఒక కాన్సెప్ట్ విడియోను రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్.. వైరల్ అవుతున్న వీడియో!
చైతన్యకి విలన్ గా బాలీవుడ్ హీరో
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ పోస్ట్ చేశారు మేకర్స్. 'లాపతా లేడీస్'(laapataa-ladies) ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. 'లాపతా లేడీస్' సినిమాలో లీడ్ రోల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన శ్రీవాస్తవ.. ఈ సినిమాలో చైకి విలన్ గా కనిపించబోతున్నారు. ''ప్రపంచం ఇప్పటివరకు అతని సున్నితమైన అందాన్ని చూసింది... ఇప్పుడు, అతడి ఇంతకు ముందు చూడని అవతార్ కోసం సిద్ధంగా ఉండండి 🔥🔥🔥'' అంటూ శ్రీవాస్తవ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో శ్రీవాస్తవ తెలుగు తెరపై అడుగుపెట్టబోతున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది ప్రేక్షకుల్లో. అంతేకాదు శ్రీవాస్తవ ఎంట్రీతో టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
The world saw his gentle charm…
— NC24 (@Nc24chronicles) August 28, 2025
Now, get ready for his NEVER BEFORE SEEN AVATAR 🔥🔥🔥
Happy Birthday #SparshShrivastava 🤗
Welcome to the Mythical world of #NC24 ❤️🔥 pic.twitter.com/AUsIF0A2na
Also Read : కల్కి+ఖలేజా= మిరాయ్.. ఈ ఒక్క ట్రైలర్‌లోనే ఇన్ని సినిమాలా?