/rtv/media/media_files/2025/01/23/hqc3VCAKizSPYrtcvOXX.jpg)
dil raju mother admitted to hospital
Dil Raju IT Raids: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలోనే దిల్‌రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెను ఏ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు..? ఆమె అనారోగ్యానికి గురి కావడానికి గల కారణం ఏంటి..? ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? అనే పూర్తి విషయాలు త్వరలో తెలియాల్సి ఉంది.
Also Read: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
గత రెండు రోజులుగా ఐటీ సోదాలు
Also Read: నేడు ఈ 2 రాశులవారికి మనోబలం ఎక్కువగా ఉంటుంది...ఈ రాశుల వారికి అయితే..!
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయనతో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ ఉజాస్ విల్లాస్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అలాగే రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి, శిరీష్ ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు గాలింపు చేస్తున్నాయి.
Also Read: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తి
200 మంది ఐటీ అధికారులు
దాదాపు 200 మంది ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ కాగా.. వాటికి అయిన బడ్జెట్ ఎంత?, ఎంత కలెక్షన్స్ వచ్చాయి?, వచ్చిన డబ్బుకు టాక్స్ లెక్కల మాటేంటి? అనే పలు అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఈ రెండు సినిమాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.
దానికి కారణం వీరి పోస్టర్లే అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చినా.. ఫస్ట్ డే రూ.186 కోట్లు రాబట్టినట్లు చెప్పడంతో పాటు జోరుగా కలెక్షన్లు వచ్చినట్లు పోస్టర్లు వేశారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం అతి తక్కువ సమయంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిపోయినట్లు పోస్టర్లు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.