/rtv/media/media_files/2025/10/09/rajamouli-2025-10-09-13-00-40.jpg)
Rajamouli
Rajamouli: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29పై ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని గాసిప్స్ హల్‌చల్ చేస్తున్నాయి.
Also Read: Telusu Kada Trailer: స్టార్ బాయ్ సిద్ధు ‘తెలుసు కదా’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్!
SSMB-29’s rumoured title - ‘Varnasi’
— Flim Updates⚕️ (@Dasarathan_1720) October 9, 2025
Official announcement on November 16th.
Rajamouli x Mahesh Babu 🔥 pic.twitter.com/Ol35TMDLtj
గతంలో ఈ సినిమాకు Maharaj, Globetrotter, GEN63 వంటి పేర్లు చర్చల్లోకి వచ్చాయి. తాజాగా వాటి జాబితాలో ‘వారణాసి’(SSMB 29 Varnasi) కూడా చేరింది. ఈ టెంపరరీ టైటిల్ సడన్‌గా వినిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే, ఈ సినిమా ఒక గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని ముందే చెప్పడం జరిగింది. ప్రపంచమంతా తిరిగే కథలో “వారణాసి” అనే పేరు ఎలా సరిపోతుందో అన్న సందేహం ఫ్యాన్స్‌లో నెలకొంది.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
ఈ చిత్రం కోసం మహేశ్ బాబు ఫిజికల్‌గా కూడా చాలానే మారిపోయారు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా మహేశ్ బాబు పాన్ వరల్డ్ లెవెల్‌కి వెళ్ళబోతున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండటం కూడా మేజర్ ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
నవంబర్‌లో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
నవంబర్‌లో అధికారికంగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే టైటిల్ బజ్ ఊపందుకోవడంతో రాజమౌళి వీటిపై స్పందిస్తారో లేదో అన్నది ప్రేక్షకుల ఆసక్తి రేపుతోంది. గతంలో కూడా రాజమౌళి ఇలా కొన్ని టైటిళ్లపై ఊహాగానాల్ని పక్కన పెట్టిన సందర్భాలున్నాయి. ఇదీ అలాంటిదేనా? లేక వాస్తవంగానే "వారణాసి" అనే టైటిల్ ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
మొత్తానికి, మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టైటిల్‌పై క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి దీనిపై నోరు విప్పుతారేమో చూడాలి.