సీఎం రేవంత్‌ను కలవను.. అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!

గురువారం సీఎం రేవంత్‌తో టాలీవుడ్‌ పెద్దలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌తో జరిగే భేటీకి అల్లు అర్జున్‌ హాజరుపై సస్పెన్స్‌ నెలకొంది. ప్రస్తుతం సంధ్య తొక్కిసలాట కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఈ భేటీకి బన్నీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth and Allu Arjun

CM Revanth and Allu Arjun

గురువారం సీఎం రేవంత్‌తో టాలీవుడ్‌ పెద్దలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌తో జరిగే భేటీకి అల్లు అర్జున్‌ హాజరుపై సస్పెన్స్‌ నెలకొంది. ప్రస్తుతం సంధ్య తొక్కిసలాట కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఈ భేటీకి బన్నీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సూచనతో ఈ సమావేశానికి హాజరుకావొద్దని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.    

Also Read: అక్రమసంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1

ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం దిశగా సీఎం రేవంత్‌తో చర్చలు జరుపుతామని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు చెప్పారు. బుధవారం కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాత సంస్థ మైత్రిమూవీమేకర్స్ తరఫున రెండు కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 

Also Read: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస వైమానిక దాడులు..!

మరోవైపు ఈ ఘటనలో దిల్ రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్స్ ముగించుకుని అమెరికా నుంచి రాగానే సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన ఆయన.. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి వెళ్తామని ప్రకటించారు. సమస్యను వీలైనంత త్వరగా సద్దుమణిగేలా సీఎంతో చర్చిస్తామని, తమనుంచి అన్ని విధాల సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించగా.. శ్రేతేజ్ కోలుకోవడం ఊరటకలిగించే అంశమని చెప్పారు.

Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు

Advertisment
తాజా కథనాలు