Pakistan: పాకిస్థాన్ మరోసారి వైమానికి దాడులతో అఫ్గానిస్థాన్‌పై భీకర దాడులతో విరుచుకు పడింది. బర్మల్ జిల్లాలోని ఏడు గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్ ఈ దాడులకు దిగగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే గాయపడిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. అయితే వజీరిస్థానీ శరణార్థులే ఈ దాడుల్లో ఎక్కువగా చనిపోయినట్లు అధికారులు చెప్పారు. Also Read: Vajpayee: వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాలు..ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం! డిసెంబర్ 24వ తేదీ అర్థరాత్రి సమయంలో.. అఫ్గానిస్థాన్‌లోని బర్మల్ జిల్లా పక్తికా ప్రావిన్సు లక్ష్యంగా పాకిస్థాన్ వైమానికి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 15 మంది చనిపోగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. వజీరిస్థానీ నుంచి వచ్చిన శరణార్థులే ఈ దాడుల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ అధికారులు అంటున్నారు. అలాగే దాడులకు పాల్పడింది పాకిస్థాన్ యుద్ధ విమానాలేనని స్థానిక ప్రజలు చెబుతున్నారు. Also Read: TG News: గద్వాల గురుకులంలో ఘోరం.. చెప్పులు లేకుండా 18 కి.మీ నడుస్తూ..! పాకిస్థాన్ చేసిన ఈ మారణకాండపై తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది. తాము కూడా ప్రతిదాడులు చేస్తూ కచ్చితంగా పగ తీర్చుకుంటామని అంది. తమ దేశ సరిహద్దును కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని వివరించింది. సరిహద్దు సమీపంలోని తాలిబన్ రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు భద్రతా వర్గాలు వివరిస్తున్నాయి. Also Read: ఏపీలో ఘోర విషాదం! కొడుకు హిజ్రాను ప్రేమించాడని.. పేరెంట్స్ ఏం చేశారంటే కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా... తామే అఫ్గానిస్థాన్‌పై దాడులు చేసినట్లు చెప్పలేదు. పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడంతో.. పాకిస్థాన్‌యే ఈ దాడులు చేసినట్లు అంతా అనుకుంటున్నారు. గత నెలలో పాక్ దళాలపై జరిగిన ఉగ్రదాడులకు కారణం తాలిబన్లే అని పాకిస్థాన్ ఆరోపించింది. Also Read: SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో.. కానీ తాలిబన్లు మాత్రం వాటిని ఖండించారు. పాక్‌లో జరిగిన దాడులకు తమకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈక్రమంలోనే పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో.. తాలిబన్లు మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి.