/rtv/media/media_files/2025/02/22/yra84FoyccnzFvZxGrUu.jpg)
tollywood actor sumanth anaganaga movie teaser released
టాలీవుడ్ హీరో సుమంత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో కనిపిస్తున్నాడు. గతంలో ఆయన చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సత్యం, ప్రేమ కథ, గుండా, గోదావరి, క్లాస్‌మేట్స్, చిన్నోడు, మహానంది వంటి క్లాసికల్ సినిమాలతో అప్పట్లో స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్నాడు.
Also Read: తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య
అయితే కాల క్రమేణా అతడు సినిమాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడిప్పుడే అతడు మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మళ్లీరావా, సుబ్రహ్మణ్యపురం, మళ్లీ మొదలైంది, సీతారామం వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. సీతారామం సినిమాలో అతడి యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
‘అనగనగా’ మూవీ
ఇక ఈ హీరో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. అదే ‘అనగనగా’ మూవీ. సన్నీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుమంత్ టీచర్‌గా కనిపించనున్నాడు. ఈటీవీ విన్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
టీజర్ రిలీజ్
ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ఈ తరుణంలో మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమా టీజర్‌ను వదిలారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఉగాది కానుకగా ఓటీటీలోకి రానుంది.