/rtv/media/media_files/2025/06/23/this-week-theatre-and-ott-movies-and-web-series-2025-06-23-09-40-16.jpg)
This Week theatre and Ott Movies and web series
జూన్ నెలలో మరో వారం వచ్చేసింది. ఈ వారం పలు చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ ఒకటి. ధనుష్, నాగార్జున్ నటించి ‘కుబేర’. ఈ రెండు సినిమాల్లో కుబేర అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
This Week Movies
ఇక ఈ వారం కూడా బడా హీరోలు నటించిన ‘కన్నప్ప’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మంచు విష్ణు నటించిన ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. అలాగే థియేటర్‌లో మరికొన్ని చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
కన్నప్ప
మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో వస్తున్న ‘కన్నప్ప’ జూన్ 27 రిలీజ్ కానుంది. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మార్గన్: ది డెవిల్
విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘మార్గన్: ది డెవిల్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
మా
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నటిస్తున్న కొత్త చిత్రం ‘మా’. హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్
పింటు పింటు సుర్గా (సినిమా) ఇంగ్లీష్ జూన్ 26
స్క్విడ్ గేమ్: ఫైనల్ సీజన్ (సిరీస్) జూన్ 27
రైడ్2 (హిందీ సినిమా) - జూన్ 27
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (రియాల్టీ షో) జూన్ 28
జియో హాట్‌స్టార్
తు దడ్కన్ మే దిల్ (హిందీ సినిమా) జూన్ 23
ది గిల్డెడ్ ఏజ్ (సిరీస్: సీజన్3) జూన్ 23
ఐరన్ హార్ట్ (సినిమా) జూన్ 25
స్మార్ట్ ఆఫ్ బ్యూటీ (వెబ్ సిరీస్) జూన్ 26
ది బేర్ (సిరీస్: సీజన్4) జూన్ 26
మిస్టరీ (సిరీస్) జూన్ 27
ది బ్రూటలిస్ట్ (సినిమా) జూన్ 28
అమెజాన్ ప్రైమ్
పంచాయత్ 4 (హిందీ వెబ్ సిరీస్) జూన్ 24
జీ5
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు వెబ్ సిరీస్) జూన్ 27
బిబిషన్ (బెంగాలీ వెబ్‌సిరీస్) జూన్ 27
ott-releases-this-week | new-ott-release-this-week | this-week-ott-movies