Thandel: నా పేరు మార్చుకుంటా: డైరెక్టర్ చందూ మొండేటి సంచలన కామెంట్స్!

నాగ చైతన్య ‘తండేల్’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని అన్నారు. అలా అనిపించకపోతే తన పేరు మార్చుకుంటా అని చందూ మొండేటి పేర్కొన్నారు.

New Update
thandel movie director Chandoo Mondeti name change comments viral

thandel movie director Chandoo Mondeti name change comments viral

నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘తండేల్’. చందూమొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పలుగా.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షాకభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. 

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ నెల అంటే ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ గా మారాయి. 

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

ఆయన మాట్లాడుతూ.. తండేల్ మూవీ మళ్లీ మళ్లీ చూడాలని ప్రేమికులకు అనిపించకపోతే తాను పేరు మార్చుకుంటానని అన్నాడు. అయితే హిట్ అవుతుందా లేక కమర్షియల్ హిట్ అవుతుందా అనే దాని
గురించి తాను ఇలా అనడం లేదని చందూ పేర్కొన్నాడు. 

Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

అంతేకాకుండా చాలా మంది బుజ్జి తల్లులు ఉన్నారని.. అలాగే చాలా మంది రాజులు ఉన్నారని అన్నాడు. వాళ్లు ఈ సినిమాను మళ్లీ మళ్లీ వచ్చి చూస్తారని పేర్కొన్నాడు. అలా వారు అనుకోకపోతే తన పేరు మార్చుకుంటానని అన్నాడు. దీంతో చందూ మొండేటి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలా మంది నెటిజన్లు దర్శకుడు చందూ మొండేటి కాన్ఫిడెన్స్ చూసి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఛాలెంజ్ లు అవసరమా అంటూ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అనంతరం రిజల్ట్ ఎలా ఉంటుందో.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు