బిగ్ బాస్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు..! పాపం టేస్టీ తేజ

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమోలో పృథ్వీ, గౌతమ్ కృష్ణ ఫ్యామిలీస్ హౌస్ లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా టేస్టీ తేజ ఫ్యామిలీ ఇంట్లోకి రాలేకపోయారు. దీంతో తేజ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రోమోలో కనిపించింది.

New Update

లేటెస్ట్ ప్రోమో

అయితే తాజాగా మేకర్స్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో పృథ్వీ మదర్, గౌతమ్ బ్రదర్ ఇంట్లోకి వచ్చినట్లుగా చూపించారు. వారిద్దరూ కంటెస్టెంట్ తో డాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత  పృథ్వీ తన అమ్మను ఇంట్లో ఎవరంటే ఇష్టమని ఆగడగా.. విష్ణు ప్రియా అని చెప్పింది. 

Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం

కంటెస్టెంట్ ఫ్యామిలీస్ రావడం చూసి టేస్టీ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా తన ఫ్యామిలీ హౌస్ లోకి రాలేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయితే గత సీజన్స్ లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రతీ కంటెస్టెంట్ ఫ్యామిలీని బిగ్ బాస్ తప్పకుండా ఇంట్లోకి పంపిస్తాడు. కానీ టేస్టీ తేజకు ఇలాంటి పనిష్మెంట్ ఇదే మొదటిసారి. 

ఇది ఇలా ఉంటే ఈ వారం పృథ్వీ, యష్మీ, టేస్టీ తేజ, విష్ణు ప్రియా, అవినాష్, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ వారం యష్మీ లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. యష్మీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ .. నామిషన్స్ ప్రక్రియలో టేస్టీ తేజతో జరిగిన గొడవ కాస్త నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. 

Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా

Advertisment
Advertisment
తాజా కథనాలు