Ajith Padma Bhushan: మా నాన్న బతికుంటే బాగుండేది.. అజిత్‌ ఎమోషనల్!

తనకు పద్మ భూషణ్ పురస్కారం దక్కడంపై హీరో అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఈరోజును చూసేందుకు తన తండ్రి బతికి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోందన్నారు. తనను చూసి ఆయన ఎంతో గర్వపడేవారని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. 

New Update
Ajith Kumar emotional over Padma Bhushan award

Ajith Kumar emotional over Padma Bhushan award

గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడ సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లని అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 113 మంది పద్మ శ్రీ, 19 మంది పద్మ భూషణ్, అలాగే ఏడుగురు పద్మ విభూషణ్‌కు ఎంపికయ్యారు. అందులో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తనకు దక్కడం పట్ల అజిత్ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. 

Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

నాన్న బతికుంటే బాగుండేది

ఇంతటి గౌరవం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజును చూసేందుకు తన తండ్రి బతికుంటే ఎంతో బాగుండేదనిపిస్తోందని అన్నారు. ఈ సమయంలో ఆయన తనను చూసి ఎంతో గర్వపడేవారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. 

పద్మభూషణ్‌ పురస్కారానికి తనను సెలెక్ట్ చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని.. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. 

Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?

ఈ రోజును చూసేందుకు తన తండ్రి బతికి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోందని అన్నారు. ఈ సమయంలో తనను చూసి ఆయన ఎంతో గర్వపడేవాడని భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. నేటికి ఆయన తన తోనే ఉన్నారని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ అవార్డు మీ అందరిదని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు