/rtv/media/media_files/2025/01/26/TfRo79kOZTahpgyjOI9O.jpg)
Popular film director Shafi passes away
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ తుదిశ్వాస విడిచారు. మలయాళ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ షఫీ (50) తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగ తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్న షఫీ.. ఇటీవల అంతర్గత రక్తస్రావం కారణంగా హాస్పిటల్‌లో చేరారు.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
జనవరి 16న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో వైద్యులు పలు టెస్టులు చేశారు. అనంతరం మెదడులో రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ట్రీట్మెంట్ చేయాలని సూచించారు. ఇక శస్త్రచికిత్స చేసినప్పటికీ.. దర్శకుడు షఫీ ఆరోగ్యం కుదుటపడకపోగా.. మరింత దిగజారిపోయింది.
పరిస్థితి విషమించడంతో
దీంతో షఫీని వెంటిలేటర్‌పై ఉంచారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆయన తాజాగా కన్నుమూశారు. కాగా ఆయన 2001లో వన్ మ్యాన్ షో చిత్రంతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణరామన్, తొమ్మనుమ్ మక్కలుమ్, పులివల్ కళ్యాణం, చట్టంబినాడు, మాయావి, చాక్లెట్, మేకప్ మ్యాన్, మేరిక్కుండోరో కుంజాడు, షెర్లాక్ టామ్స్, టూ కంట్రీస్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.