/rtv/media/media_files/2025/07/13/kota-cinema-offers-2025-07-13-10-35-07.jpg)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆదివారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీనీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. 750 పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు విలనిజం, హాస్యం, కరుణ, రౌద్రం - ఇలా అన్ని రకాల రసాలను పండించి పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : 'ఇద్దరూ ఇద్దరే'.. అక్కినేనికి కోట అదిరిపోయే పంచ్!
Also Read : పాశమైలారంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో
వయోభారం కారణంగా
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగారు కోట. అయితే వయోభారం కారణంగా ఆయన చివర్లో సినిమాలకు దూరమయ్యారు. కానీ ఏ నటుడికి అయిన తాను చనిపోయే వరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉంటుంది. అలాగే కోట కూడా నటించాలని అనుకున్నారు. కానీ వయోభారం కారణంగా ఆయనకు ఆవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాల్లో కంటిన్యూగా నటించి ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక తనకు అవకాశాలు ఇవ్వండని కోట ప్రాధేయపడ్డారు. దర్శకులు త్రివిక్రమ్ లాంటి వాళ్లు తనకు మంచి పాత్రలు ఇవ్వాలని కోరారు. ఫ్రీగా కూడా సినిమాలు చేయడానికి కూడా తాను సిద్ధమేనన్నారు.
అయితే వయోభారం కారణంగా ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు దక్కలేదు. సీనియర్ నటుడైనా కోటను రెండు రోజుల పాత్రకు పిలిపించి ఇబ్బంది పెట్టడం ఎందుకని దర్శకనిర్మాతలు ఆలోచించి ఆయనకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. మా ఎలక్షన్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కోటా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : మీమ్స్ లోనూ 'కోట'.. ఎవర్ ట్రెండింగ్ మీమ్స్ ఇవే!
Also Read : కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !
kota srinivas rao latest news | Actor Kota Srinivasa Rao | tollywood