అల్లు అర్జున్ పై సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నట్లుగా అల్లు అర్జున్ మాట్లాడటం సరికాదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదంటూ అల్లు అర్జున్ మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకున్నా అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. Also Read : ఈసీ సమగ్రతను దెబ్బతీస్తున్నారు.. కేంద్రంపై మల్లికార్జున ఖర్గే ఫైర్ పోలీసులు చెప్పినా వినలేదు.. బయట పరిస్థితి బాగా లేదని సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కు పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డీసీపీ చెప్పినా పట్టించుకోలేదని ఫైర్ అన్నారు. ఆన్ రికార్డ్ అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాలు తప్పు అని చెప్పడం సరికాదన్నారు. బెనిఫిట్స్ షోలు, టికెట్ ధరల పెంపు ఇక ఉండదని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీతో తమకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. మంచి ప్రొడ్యూసర్ దిల్ రాజును ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించామన్నారు. అంతా సర్దుకుపోతుందన్నారు. ఎవరూ ఆదుకోకపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. Also Read : అల్లు అర్జున్ సంచలన ట్వీట్.. ఫ్యాన్స్ కు రిక్వెస్ట్, వారికి వార్నింగ్! చిరంజీవి ఎందుకు వెళ్లలేదు? చిరంజీవి అయినా ఆస్పత్రికి వెళ్లి బాధిత చిన్నారిని పరామర్శిస్తే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కు సపోర్ట్ కు వెళ్లిన వారంతా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే మంచి సంకేతాలు వెళ్లేవన్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్క్రిప్ట్ రాసుకొని అల్లు అర్జున్ మాట్లాడారన్నారు. ట్విట్టర్ టిల్లు, అగ్గిపెట్టె లంబూలు అల్లు అర్జున్‌కు వత్తాసుగా మాట్లాడారని కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విమర్శించారు. అయితే.. ఈ వివాదంలోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Also Read : అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన! Also Read : 'పక్కా ప్లాన్ తో కుట్ర.. అక్బరుద్దీన్ ప్రశ్న.. రేవంత్ ఆన్సర్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్'