Allu Arjun: అల్లు అర్జున్ సంచలన ట్వీట్.. ఫ్యాన్స్ కు రిక్వెస్ట్, వారికి వార్నింగ్!

సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు అల్లు అర్జున్‌ సూచించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.

New Update
allu arjun tweet on fake posts

allu arjun tweet file photo

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సంధ్య థియేటర్ ఘటన మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆయన అల్లు అర్జున్ పై తీవ్ర ఆరోపణలు చేయడం, దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అందులో తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ ఈ ఇష్యూ గురించే చర్చించుకుంటున్నారు. 

అయితే, కొందరు సోషల్‌మీడియా ముసుగులో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసుకుని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అల్లు అర్జున్ తాజాగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. అందులో..' నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం.

ఇది కూడా చదవండి: అబద్ధాలు చెప్పకు పుష్ప.. ఇదిగో ప్రూఫ్.. కాంగ్రెస్ నేత సంచలన వీడియో

ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను..' అని పేర్కొన్నారు. ప్రస్తుతం బన్నీ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు