Barrelakka: ఆడబిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. పాప ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

బర్రెలక్క శిరీష పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పాప చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు.

New Update
Barrelakka

Barrelakka

బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగం లేదని.. నాలుగు బర్రెలు కొనుక్కోవడం బెటర్ అనే రీల్ చేసి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది. ఒక్క రీల్‌తో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసింది. కానీ గెలవలేదు.  అయితే ఈ రాజకీయాలు అన్ని జరిగిన తర్వాత బర్రెలక్క వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కుటుంబంతో హ్యాపీగా ఉంది. అయితే తాజాగా బర్రెలక్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, నెటిజన్లు బర్రెలక్కకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. బర్రెలక్క సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తగత విషయాలు అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆసుపత్రి, డెలివరికి సంబంధించిన వీడియోలు తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూనే ఉంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క తన కష్టం మీద ఎదిగింది. 

ఇది కూడా చూడండి: Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్

క్యూటీ బేబీ

బర్రెలక్కకు పుట్టిన పాప చాలా క్యూట్‌గా ఉందని, తల్లిలాగే ఎంతో అమాయకంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాప ముఖాన్ని చూపిస్తున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. బర్రెలక్కలా ఆమె బేబీ కూడా క్యూట్‌గా ఉందని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే బర్రెలక్క అసలు పేరు శిరీషా. ఒకప్పుడు తన బర్రెలను మేపుకుంటూ సరదాగా చేసిన వీడియోలు ఆమెను యూట్యూబ్‌ స్టార్‌గా మార్చాయి. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి వెళ్తుందని జోరుగా ప్రచారం అయితే జరిగింది. కానీ వెళ్లలేదు. ఏదేమైనా పాపతో బర్రెలక్క హ్యాపీగా ఉండాలని నెటిజన్లు మెసేజ్‌లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: BREAKING: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు

#barrelakka-sirisha #barrelakka #mahabboob nagar #telangana
Advertisment
తాజా కథనాలు