BREAKING: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటి ముందు కాల్పులు కలకరం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి మూడు నుండి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.

New Update
disha patani

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటి ముందు కాల్పులు కలకరం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి మూడు నుండి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. కాల్పులకు కారణమైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రముఖ గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా మరియు గోల్డీ బ్రార్ ముఠా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఓ ఆన్‌లైన్ పోస్ట్ ద్వారా ఈ ముఠా ఈ కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, సినిమా ప్రముఖులకు కూడా తీవ్రమైన బెదిరింపులు జారీ చేసింది. బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న విల్లా నంబర్ 40 వద్ద ఈ కాల్పుల సంఘటన జరిగినట్లుగా ఆ పోస్ట్‌లో ఉంది.

ఈ గ్యాంగ్‌కు కాల్పుల సంఘటనతో సంబంధం ఉందనే విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ బెదిరింపు సందేశం సోషల్ మీడియాలో మరియు స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విధమైన ముఠా బెదిరింపులు సినిమా పరిశ్రమలో భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు