శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ వచ్చే శుక్రవారం విడుదల అవనుంది. డాకూ మహారాజ, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్‌తో పాటూ గేమ్ ఛస్త్రంజర్ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. దీని టికెట్ల పెంఉ విషయంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు, జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ఉదయం 4, 6 గంటల షలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే అర్ధరాత్రి ఒంటిగంటకు వేసే బెనిఫిట్ షోకు మాత్ర అనుమతి ఇవ్వలేదు. దాని కోసం చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఆంధ్రాలో కూడా అనుమతి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడో టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చేసింది. అక్కడ గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ రెండు సినిమాలకూ టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఒప్పుకున్నారు. ఏపీలో అర్ధరాత్రి 1గంట బెనిఫిట్ షో కూడా వేయనున్నారు. దీని టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. అలాగే జనవరి 10న ఆరు షోలకు కడా అనుమతినిచ్చింది ఏపీ గవర్నమెంట్. ఇక టికెల రేట్ల విషయానికి వస్తే..మల్టీ ప్లెక్స్‌లో అదనంగా జీఎస్టీతో కలిపి రూ..175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకూ టికెట్ ధర పెంచేందుకు అనుమతి లభించింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. Also Read: AP: రేపు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు