Game Changer : 'గేమ్ ఛేంజర్' కు ప్రభుత్వం బిగ్ షాక్.. ఆ షోలు రద్దు

'గేమ్ ఛేంజర్' మూవీ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రిలీజ్ కు ముందు అనుమతిచ్చిన స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
game changer  special shows

ram charan game changer

'గేమ్ ఛేంజర్' మూవీ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రిలీజ్ కు ముందు అనుమతిచ్చిన స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. 

బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది. దీంతో ఆ షోలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. అసలే ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్  అందుకున్న 'గేమ్ ఛేంజర్' కు ఇలా ఉన్నట్టుండి స్పెషల్ షోలు క్యాన్సిల్ చేయడం సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ

 విచారణ లో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి.. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

శంకర్‌ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటించిన 'గేమ్‌ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాల నడుమ విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ టాక్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. ఈ ఓపెనింగ్స్ తో 'గేమ్ ఛేంజర్' మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది.

Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు