Tamannah Odela 2 - Teaser: మిలియన్ల వ్యూస్ తో రచ్చ లేపుతున్న 'ఓదెల 2' టీజర్..!

మిల్కీ బ్యూటీ.. తమన్నా, డైరెక్టర్ అశోక్ తేజ కాంబోలో వస్తున్న "ఓదెల్-2" టీజర్ వచ్చేసింది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఆధ్యాత్మిక అంశాలతో ఈ టీజర్ అదిరిపోయింది. అయితే, అయితే టీజర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు మూవీ టీం.

New Update
Tamannah Odela 2 - Teaser

Tamannah Odela 2 - Teaser

Tamannah Odela 2 - Teaser: మిల్కీ బ్యూటీ.. తమన్నా, డైరెక్టర్ అశోక్ తేజ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ "ఓదెల్-2" టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. 

Also Read:Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

ఈ సందర్భంగా తమన్నా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ సినిమాను తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదిగా పేర్కొంటూ, ఈ సినిమాలో ప్రతి సీను క్లైమాక్స్ లా అనిపిస్తుంది అని తెలిపింది.  ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు. తమన్నా ఈ సినిమాలో అఘోరీ పాత్రలో కనిపించనుంది.

Also Read:Viral News: రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

ప్రతీ సీన్ క్లైమాక్స్ రేంజ్ లో..

తమన్నా మాటలకు ఈ సినిమా పై ఒకేసారి హైప్ పెరిగిపోయింది. తమన్నా మాట్లాడుతూ.. "సంపత్ నంది, నేను మొదట్లో చిన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రారంభించాం. తర్వాత ఇది భారీ ప్రాజెక్టుగా మారింది. కొన్ని సార్లు, రెండు యూనిట్స్ తో ఒకేసారి పని చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్ రేంజ్ లో కొన్ని సన్నివేశాలను తీశాం," అని చెప్పుకొచ్చింది. తన పర్సనల్ లైఫ్ అనుభవాలకు దగ్గరగా ఈ సినిమా ఉంటుంది అని తన మనసులోని మాట పంచుకుంది.

"ఓదెల-2" సినిమా టీజర్ ను మహాకుంభమేళాలో విడుదల చేశారు. ఒక భక్తురాలి భక్తి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చని తమన్నా వెల్లడించింది. ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే, ఇందులో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు మూవీ టీం. 

Advertisment
తాజా కథనాలు