Surya Son of Krishnan: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న సూర్య బ్లాక్ బస్టర్ మూవీ

ప్రేమికుల దినోత్సం సందర్భంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కానుంది. సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు.

New Update
Surya Son of Krishnan

Surya Son of Krishnan Photograph: (Surya Son of Krishnan)

ద్విపాత్రాభినయంలో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా అంటే చాలా మందికి ఇష్టం. ఈ సినిమాలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ముఖ్యపాత్రల్లో నటించారు. తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. అయితే ఈ సినిమాను థియేటర్‌లో చూడలేకపోయామని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాంటివారికి ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే సూర్య సన్నాఫ్ కృష్ణన్ మరోసారి థియేటర్లలో రానున్నాడు.

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

తమిళంలో కంటే తెలుగులోనే..

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించారు. ఈ సినిమా 2008లో విడుదలైంది. తమిళంలో కంటే తెలుగులో బాగా హిట్ అయ్యింది. ఇందులో సూర్య నటనతో పాటు పాటలు బాగా హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ పాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ సందర్భంగా మరోసారి మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. గతేడాది కూడా ప్రేమికుల దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేశారు. మళ్లీ ఈ ఏడాది కూడా చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు