/rtv/media/media_files/2025/04/25/mwWM0GYKDALL5kzH5I4D.jpg)
keerthi suresh with suriya in venky atluri movie
Suriya 796CC టాలీవుడ్ మహానటి కీర్తిసురేష్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో కీర్తి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో '796CC' వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read : రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!
సూర్య జోడీగా..
అయితే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే డైరెక్టర్ వెంకీ ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా సానుకూలంగా స్పందించారట. దీంతో ఆమె ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం. కీర్తి పాన్ ఇండియా ఆకర్షణ, నటన నైపుణ్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి ఆమె అనువైన ఎంపిక అని భావించారట మేకర్స్.
#KeerthySuresh is being considered as the female lead in #Suriya's film with director Venky Atluri. #Retro #RetroFromMay1 pic.twitter.com/A3KC3EHvfN
— Telugu Chitraalu (@TeluguChitraalu) April 23, 2025
Also Read : పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?
ఒక్కోసారి ఒక్కో కొత్త కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ.. ఈసారి 80s బ్యాక్ డ్రాప్ ఆటో మొబైల్ ఇంజనీరింగ్ కథ నేపథ్యంలో సినిమాను రూపొందించబోతున్నారట. ఇండియాస్ ఫస్ట్ మారుతి కారు వచ్చిన సమయంలో జరిగే కథ. అందుకే ఈ సినిమాకు ‘796CC’ టైటిల్ అనుకుంటున్నారు.. కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇందులో సూర్య యంగ్ ఇంజనీరింగ్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే సూర్య- కీర్తి సురేష్ 'Thaanaa Serndha Koottam' అనే తమిళ్ చిత్రంలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. ‘సర్’, ‘లక్కీ బాస్కర్’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య 'రెట్రో' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 1న విడుదల కానుంది. ఇందులో సూర్య జోడీగా పూజ హెగ్డే నటించింది. 'కంగువా' నిరాశ చెందిన ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత!
Also Read : నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
cinema-news | latest-news | telugu-news | keerthi-suresh