/rtv/media/media_files/2025/01/25/gvndG2GmO2FiyEVPupJy.jpg)
supreme court issued notice to kannada hero darshan
Actor Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ గతంలో చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ప్రేయసి కోసం తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన ఘటనలో గత కొంత కాలంగా జైలు జీవితం గడిపారు. A1 గా పవిత్ర గౌడ , A2 గా దర్శన్ సహా ఏడుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే ఇటీవలే కర్ణాటక హైకోర్టు దర్శన్, పవిత్ర గౌడతో పాటు ఏడుగురు ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్
ఈ తరుణంలో ఇప్పుడు దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను బెంగళూరు పోలీసులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుల పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిన్న (జనవరి 24న) విచారణ జరగగా.. అదే సమయంలో రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏడుగురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
ఇక విచారణ సమయంలో ప్రభుత్వం తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. నిందితులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని.. అందువల్ల హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని వారు కోర్టును కోరారు. దీంతో సుప్రీం కోర్టు ఆ ఏడుగురు నిందితులకు నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
దీంతో మిగిలిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇది వర్తించదు. అనంతరం హైకోర్టు తీర్పులు వర్తించవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే దర్శన్ ప్రస్తుతం ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘డెవిల్’ సినిమాలో త్వరలో నటించబోతున్నాడు.
ఇది కూడా చదవండి: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్