Rajinikanth Temple: సూపర్ స్టార్‌కు గుడి కట్టిన రిటైర్డ్ సైనికుడు.. ఫొటోలు వైరల్!

సూపర్‌స్టార్ రజినీకాంత్‌‌కు ఓ వీరాభిమాని గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మధురైకు చెందిన రిటైర్డ్ సైనికుడు కార్తీక్ తన ఇంట్లో గుడికట్టి రజినీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Rajinikanth fan dedicated temple to actor at Madurai home

Rajinikanth fan dedicated temple to actor at Madurai home

హీరోలపై తమ ఫ్యాన్స్‌కు ఉండే అభిమానం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తమ హీరో సినిమా వస్తుందంటే రచ్చ రచ్చ చేస్తారు. ఫ్లెక్సీలు కట్టి థియేటర్ ముందు టపాసులతో గోలగోల చేస్తారు. అది మాత్రమే కాదు అభిమాన హీరో పుట్టిన రోజు, పెళ్లి రోజు.. ఇలా ప్రతీ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 

కొందరేమో అభిమాన హీరో కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. మరికొందరేమో అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహిస్తారు. ఇంకొందరు ఏకంగా తమ హీరో కోసం ఏకంగా గుడి కట్టేస్తారు. ఇప్పటికి చాలా మంది ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా మరో అభిమాని తాను ఎంతగానో ఇష్టపడిన హీరో కోసం గుడి కట్టాడు. 

Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్

రజినీకాంత్‌కు గుడి

మీరు విన్నది నిజమే.. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఓ వీరాభిమాని గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ రిటైర్డ్ సైనికుడు. అతడు రజినీకాంత్‌కు పిచ్చ ఫ్యాన్. దీంతో తన అభిమాన హీరోపై అమితమైన ప్రేమ చూపించాడు. 

రజినీ నటనకు ఇంప్రెస్ అయిన కార్తీక్ ఇప్పుడు అతడిని దేవుడిలా చూస్తున్నాడు. రజనీకాంత్ కోసం కార్తీక్ గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ గుడిని తన ఇంట్లోనే కట్టించడం విశేషం అనే చెప్పాలి. అనంతరం ఇంట్లో నిర్మించిన గుడిలో రజినీ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేశాడు. 

ఇది కూడా చదవండి: సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!

3 అడుగుల ఎత్తు

ఈ ఆలయంలో 3 అడుగుల ఎత్తున్న 250 కిలోల బరువు గల రజనీకాంత్ విగ్రహం ఉంది. గత నెలలో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విగ్రహాన్ని మార్చారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ అభిమాని ప్రేమను అర్థం చేసుకున్నాడు. దీంతో వెంటనే కార్తీక్ అండ్ అతని ఫ్యామిలీని తన ఇంటికి ఆహ్వానించాడు. అనంతరం వారికి విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు