SS Rajamouli: భారీ ప్రమోషన్స్, స్టార్ కాస్ట్ ఇవన్నీ లేకపోయినా కథలో మ్యాటర్ ఉంటే చాలని నిరూపిస్తాయి కొన్ని సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!
Saw a wonderful, wonderful film Tourist Family.
— rajamouli ss (@ssrajamouli) May 19, 2025
Heartwarming and packed with rib-tickling humor. And kept me intrigued from beginning till end. Great writing and direction by Abishan Jeevinth.
Thank you for the best cinematic experience in recent years.
Don’t miss it…
Also Read : 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్
బెస్ట్ సినిమా
తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ చిత్రాన్ని అభినందించారు.
సినిమాను ప్రశంసిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''అద్భుతమైన.. అద్భుతమైన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ' చూశాను. ఇది నా హృదయాన్ని కదిలించింది. చక్కిలిగింతలు పెట్టే హాస్యంతో కడుపుబ్బా నవ్వించింది. దర్శకుడు అభిషాన్ జీవింత్ కథను గొప్పగా రచించి డైరెక్ట్ చేశారు. ఇటీవలే కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. మీరు కూడా మిస్ అవ్వకండి'' అంటూ పోస్ట్ పెట్టారు రాజమౌళి
Also Read : తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు
Also Read: SRH VS LSG: తాను పోయింది...లక్నోను తీసుకెళ్ళిపోయింది
director Abishan Jeevinth | telugu-news