/rtv/media/media_files/2025/04/21/PkJLoQZjyagBhvZOJ7ff.jpg)
Srinidhi Shetty HIT- 3
Srinidhi Shetty HIT- 3: నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాణంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘HIT 3’ మే 1, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్లు జోరుగా కొనసాగుతుండగా, ఈ సినిమాలో నానితో జతకట్టిన శ్రీనిధి శెట్టి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..
నాని ఒక బ్రాండ్..
కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి, ఈ సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆఫర్ వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు ఆమె వెల్లడించారు. ‘‘నాని ఒక బ్రాండ్ లాంటివారు. ఆయన నుంచి సినిమా ఆఫర్ వస్తే, వందశాతం ఓకే చెప్పాల్సిందే’’ అని శ్రీనిధి చెబుతూ, నానితో పని చేయడం తనకు గొప్ప అవకాశం అని తెలిపారు.
Also Read: 'కింగ్డమ్' నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
ఈ సినిమాలో ఆమె నానీ భార్య పాత్రలో నటించనున్నారు. ప్రోమోల్లో శ్రీనిధి తక్కువగా కనిపించడంపై ప్రశ్నించగా, ‘‘నా పాత్ర చాలా కీలకం. అంతుచిక్కని మలుపులు ఉన్న కథలో, నా పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, HIT యూనివర్స్‌లో మరో పవర్ఫుల్ చాప్టర్‌గా రూపొందింది. క్రైమ్, థ్రిల్, ఎమోషన్స్ మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించిన HIT 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి.