Sobhita Dhulipala: శోభిత వైరల్ పోస్ట్.. ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అంట..

శోభిత దూళిపాళ్ల గత కొంతకాలంగా అమ్మడు ట్రెండింగ్ లో ఉంటుంది, తన చిత్రం 'మంకీమ్యాన్' బాఫ్టా అవార్డులలో అగ్ర స్థానం పొందింది. ఈ సినిమా రాటెన్ టొమాటోస్ ద్వారా బెస్ట్ రివ్యూ, బెస్ట్ యాక్షన్, అడ్వెంచర్ ఫిల్మ్ కేటగిరీలలో విజయాన్ని సాధించింది.

New Update
Sobhita Dhulipala

Sobhita Dhulipala

Sobhita Dhulipala: నటి మోడల్ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత సంవత్సరం, 'మంకీమ్యాన్' (Monkey Man) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శోభిత, ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ పొందింది. శోభిత పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే, ఇటీవల నాగచైతన్య (Naga Chaitanya)తో ప్రేమలో ఉన్న ఆమె, 2024 డిసెంబర్ 4న కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా, తన వ్యక్తిగత జీవితాన్ని అనుభవిస్తున్న ఆమె, అక్కినేని కుటుంబానికి కోడలిగా చేరడం తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

Also Read :వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినప్పటికీ, శోభిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో బాగా యాక్టివ్ గా ఉండి, చైతన్యతో వెకేషన్లకు వెళ్లి, అక్కడి ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవల, శోభిత తన తాజా ప్రాజెక్ట్ 'మంకీమ్యాన్' గురించి గొప్ప న్యూస్ షేర్ చేసింది. ఈ సినిమా, బాఫ్టా (BAFTA) అవార్డులలో ఆమోదం పొందడంతో పాటు, రాటెన్ టొమాటోస్ ద్వారా బెస్ట్ రివ్యూ పొందిన చిత్రంగా అగ్ర స్థానంలో నిలిచింది. బ్రిటిష్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ దేవ్ పటేల్ (Dev Patel) అవార్డు కూడా గెలుచుకున్నట్లు శోభిత తెలిపింది.

Also Read:పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

ఇది కలా? నిజమా..!

ఇక, 'మంకీమ్యాన్' బెస్ట్ యాక్షన్, అడ్వెంచర్ ఫిల్మ్ కేటగిరీలో విజయం సాధించిందని, శోభిత తన సోషల్ మీడియా వేదిక ద్వారా పేర్కొంది. "ఇది కలా నిజమా అర్థం కావడంలేదు, 2024 బాఫ్టా నామినేషన్లలో మంకీమ్యాన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా నిలిచింది" అని ఆమె వెల్లడించింది. ఈ వార్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయి, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read:మంచు బ్రదర్స్ మధ్య వార్.. 'తల నరికి నీ భార్య చేతిలో పెడతా' అంటూ మనోజ్ ఫైర్

Advertisment
తాజా కథనాలు