Manchu Vishnu: వీధిలో మొరిగే కుక్క.. మంచు మనోజ్ ను మళ్లీ గెలికిన విష్ణు!

మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో..' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ' అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను షేర్ చేశారు.

New Update
vishnu manchu latest tweet

manchu familiy

Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. హైదరాబాద్‌లో స్టార్ట్ అయిన మంచు ఫ్యామిలీ తగాదా ఇప్పుడు తిరుపతికి మారింది. జల్‌పల్లి ఫార్మ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న వివాదం భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. తాజాగా, మనోజ్‌.. మోహన్‌బాబు యూనివర్సిటీలో దర్శనమివ్వడం తో ఈ ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్

 మంచు కుటుంబంలోని గొడవలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఇది అన్నదమ్ముల మధ్య వివాదమా? లేక తండ్రి-కొడుకుల గొడవా? అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ గొడవకు మరింత ఆజ్యం పోస్తూ మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో RGV డైరెక్షన్ లో మోహన్ బాబు నటించిన 'రౌడీ' సినిమాలో ఓ డైలాగ్ ఆడియోను పంచుకున్నారు.

వీధిలో మొరిగే కుక్క.. 

' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ..' అనే డైలాగ్ ను షేర్ చేస్తూ..' ఇది నా ఫేవరెట్ డైలాగ్. ఇందిలో ప్రతీ డైలాగ్ ఓ స్టేట్మెంట్..' అని రాసుకొచ్చారు. 

మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో విష్ణు ఉన్నట్టుండి మోహన్ చెప్పిన డైలాగ్ ను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. విష్ణు ఇన్ డైరెక్ట్ గా మనోజ్ కు మోహన్ బాబు రూపంలో వార్నింగ్ ఇస్తున్నాడంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కొందరైతే మనోజ్ ను విష్ణు కావాలనే టార్గెట్ చేస్తున్నాడనే కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ టైంలో విష్ణు ఇలాంటి ట్వీట్ పెట్టడం వెనక అంతరార్థం ఏంటో ఆయనకే తెలియాలి.  

Also Read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?

#manchu vishnu vs manchu manoj #manchu vishnu tweet #rtv telugu news #Manchu Manoj #mohan-babu #Manchu Vishnu #latest-telugu-news #latest-movie-updates
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు