Manchu Brothers : తల నరికి నీ భార్య చేతిలో పెడతా.. మనోజ్ విష్ణును అంత మాట అన్నాడేంటి?

మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. విష్ణు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. దానికి మనోజ్ కౌంటర్ అటాక్ చేశాడు. విష్ణు పేరును ఎక్కడా వాడకుండా ఆయన 'కన్నప్ప' మూవీ రిఫరెన్స్ వాడుతూ అన్నకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

మంచు అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంచి విష్ణు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. దానికి మనోజ్ కౌంటర్ అటాక్ చేశాడు. విష్ణు పేరును ఎక్కడా వాడకుండా ఆయన 'కన్నప్ప' మూవీ రిఫరెన్స్ వాడుతూ అన్నకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. 

Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచు ఫ్యామిలీలో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ గొడవకు మరింత ఆజ్యం పోస్తూ మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో RGV డైరెక్షన్ లో మోహన్ బాబు నటించిన 'రౌడీ' సినిమాలో ఓ డైలాగ్ ఆడియోను పంచుకున్నారు.

 ' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ..' అనే డైలాగ్ ను షేర్ చేస్తూ..' ఇది నా ఫేవరెట్ డైలాగ్. ఇందిలో ప్రతీ డైలాగ్ ఓ స్టేట్మెంట్..' అని రాసుకొచ్చారు. అయితే ఇదే పోస్ట్ ను ఉద్దేశించి మనోజ్ కౌంటర్ ఇచ్చాడు. 

Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

ఈ మేరకు ఎక్స్ లో..' కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు లాగ, సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్  కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్..' అని పేర్కొన్నాడు. అలాగే పోస్ట్ లో కృష్ణంరాజు నటించిన సినిమాల పోస్టర్స్ ను జత చేశాడు. ఇద్దరి పోస్ట్ లో సింహం, కుక్క డైలాగులు కామన్ గా ఉండటంతో.. మంచు బ్రదర్స్ మధ్య నిజంగానే వార్ జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరో పోస్ట్ లో మోహన్ బాబు సినిమాలోని ఓ వీడియో క్లిప్ ను షేర్ చేశాడు మనోజ్. ఆ వీడియోలోని సంభాషణలను బట్టి మంచు ఫ్యామిలీ మధ్య గొడవలకు కారణం ఆస్తి పంపకాలే అని, మనోజ్ దగ్గరనుంచి మోహన్ బాబు, విష్ణు ఇద్దరు బలవంతంగా ఆస్తి లాగేసుకున్నారని స్పష్టం అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు