Single movie: శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'సింగిల్' మే 9న థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'సిరాకైంది సింగిల్ బతుకూ' పాటను రిలీజ్ చేశారు.
సింగిల్స్ బాధలు, ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో సాగిన ఈ మాస్ నెంబర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.
'సిరాకైంది సింగిల్ బతుకూ
హై-టెంపో వైబ్స్ తో ఉత్సాహభరితంగా పాట సాగింది. ఇందులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఎంతో చమత్కారంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా..రాహుల్ సిప్లిగంజ్ తనదైన స్టైల్లో పాటను ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'శిల్పి యెవరో' పాట కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
#Single's Frustration hits different every time💥#SirrakaindhiSingleBathuku crosses 1 Million+ views and is trending with 50K+ likes on YouTube❤️🔥
— Geetha Arts (@GeethaArts) April 18, 2025
▶️ https://t.co/um7ZpMA8yE#SingleMovie May Release🤩@sreevishnuoffl @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @caarthickraju… pic.twitter.com/ofbEE4eDL9
కళ్యా ఫిల్మ్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు తెరకెక్కించారు. గీతాఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
latest-news | cinema-news | telugu-cinema-news | telugu-news
Also Read: Mohana Krishna Indraganti: ‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు.. మోహనకృష్ణ ఇంద్రగంటి షాకింగ్ కామెంట్స్