/rtv/media/media_files/2025/04/17/tVpatCa2XbnEImXjM2ze.jpg)
fake paneer at Sharukh khan wife Gauri Khan restaurant
Sharukh Khan: ప్రముఖ యూట్యూబర్ సార్థక్ సచ్‌దేవా ముంబైలో షారుఖ్ ఖర్ భార్య గౌరీ ఖాన్ కి చెందిన హై ఎండ్ రెస్టారెంట్ 'టోర్రి'లో నకిలీ పన్నీర్ వడ్డిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. తాను గౌరీ ఖాన్ రెస్టారెంట్ లో పన్నీర్ స్వచ్ఛత కోసం ఐయోడిన్ పరీక్ష నిర్వహించగా.. ఫలితంపై చూసి తీవ్రకలత చెందినట్లు ఇన్ స్టాలో వీడియోను షేర్ చేశారు.
గౌరీ ఖాన్ రెస్టారెంట్ లో నకిలీ పన్నీర్
అయితే యూట్యూబర్ సచ్‌దేవా సెలెబ్రెటీల రెస్టారెంట్స్ లో వడ్డించే పన్నీర్ లో కల్తీ ఉందా? లేదా? తెలుసుకోవడానికి ప్రతీ రెస్టారెంట్ లో పన్నీర్ ముక్కను తీసుకొని.. దానిని ఐయోడిన్ టింక్చర్ తో టెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. పన్నీర్ పై ఐయోడిన్ టింక్చర్ వేసినప్పుడు అది నల్లగా మారితే.. కల్తీ పన్నీర్ అని అర్థం. అలా సచ్‌దేవా విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్', శిల్పా శెట్టి యొక్క 'బాస్టియన్' బాబీ డియోల్ 'సమ్‌ప్లేస్ ఎల్స్' రెస్టారెంట్స్ తో పాటు ముంబైలోని కొన్ని హై ఎండ్ ప్రదేశాల్లో పన్నీర్ పరీక్షించగా.. రిజల్ట్ నెగిటివ్ వచ్చింది.
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ హ్యాక్.. ఆమె స్టోరీలో అలాంటి మెసేజ్ లు
అయితే అదే పరీక్ష షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ 'టోరీ' రెస్టారెంట్ లో నిర్వహించగా.. పన్నీర్ నల్లగా మారడం కనుగొన్నాడు. దీంతో సార్థక్ టోరీ రెస్టారెంట్ లో నకిలీ పన్నీర్ వడ్డిస్తున్నట్లు తన వీడియోలో తెలిపాడు. కాగా, ఈ వీడియోపై 'టోరో ' రెస్టారెంట్ బృందం స్పందిస్తూ.. సార్థక్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. తమ రెస్టారెంట్ లో స్వచ్ఛత, నాణ్యత విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తామని తెలిపారు.
telugu-news | latest-news | cinema-news | sharukh-khan | Gauri Khan