Mohana Krishna Indraganti: ‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు.. మోహనకృష్ణ ఇంద్రగంటి షాకింగ్ కామెంట్స్

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జటాయు’ ప్రభాస్‌తో తెరకెక్కిస్తారన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. అలాగే 'సారంగపాణి జాతకం' ప్రమోషన్ సందర్భంగా డ్యాన్స్ షో వివాదంపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

New Update
Mohana Krishna Indraganti

Mohana Krishna Indraganti

Mohana Krishna Indraganti: ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఎప్పటినుంచో తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకొస్తున్న చిత్రం జటాయు(Jatayu). తాజాగా ఈ ప్రాజెక్టు హీరోగా ప్రభాస్(Prabhas) ఎంపిక అయ్యాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ప్రచారంపై స్వయంగా దర్శకుడు స్పందిస్తూ, ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే జటాయుకి సంబంధించిన అసలైన వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

ఈ వ్యాఖ్యలు ఆయన 'సారంగపాణి జాతకం' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తెలిపారు. ప్రియదర్శిని ప్రధాన పాత్రలో, రూప కొడువాయూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండనుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

డ్యాన్స్ షో వివాదంపై ఇంద్రగంటి రియాక్షన్

ఇటీవల ఓ టెలివిజన్ డ్యాన్స్ షోకి అతిథిగా వెళ్లిన మోహనకృష్ణ ఇంద్రగంటి, ఒక డ్యాన్సర్ ప్రదర్శనను ప్రశంసించగా, కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. క్లాసికల్ పాటకు అనుచిత దుస్తులతో డ్యాన్స్ చేశారనే విమర్శల నేపథ్యంలో స్పందించిన దర్శకుడు "అలాంటి ప్రోగ్రాముల్లో పూర్తి స్వేచ్ఛతో అభిప్రాయాలు చెప్పడం సాధ్యం కాదు. నేను ఆ అమ్మాయి కష్టాన్ని మాత్రమే చూశాను," అని వ్యాఖ్యానించారు. 

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

పచ్చళ్ల టాపిక్‌పై ప్రియదర్శి రియాక్షన్

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – "నన్ను యాక్టర్ కాదని కొంతమంది అన్నారు. వాళ్లను పట్టించుకుని ఉంటే, నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను చేయబోయే పాత్ర ఏదైనా, కామెడీ కానీ, సీరియస్ అయినా, పూర్తి నిజాయతీతో చేస్తాను," అని చెప్పారు. అలాగే, సినిమా ప్రచారంలో భాగంగా పచ్చళ్ల టాపిక్‌ను ప్రస్తావించడం వలన కొందరు విమర్శించినా, తాము ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో అది చేయలేదని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు