Kiss Song: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రజెంట్ జనరేషన్ టెస్ట్ కి తగ్గ సినిమాలు చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా 'టిల్లు స్క్వేర్' తో అదరగొట్టిన సిద్ధూ.. ఇప్పుడు మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాక్'. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: Actress Bhagya Shree: షాకింగ్.. ప్రభాస్ తల్లి తలకు గాయం.. 13 కుట్లు వేసిన వైద్యులు
కిస్ సాంగ్ ప్రోమో..
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి 'కిస్' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. వైష్ణవి- సిద్దు రొమాంటిక్ విజువల్స్ తో యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించగా.. సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
The colors of emotions blend into a beautiful journey of love 😍
— BA Raju's Team (@baraju_SuperHit) March 14, 2025
Team #Jack wishes you all a vibrant & joyful Holi 🫶🏻#KissSong – This one’s NOT leaving your playlist after March 17th 🔥
— https://t.co/cPMcMkWWRS#JackOnApril10th#SidduJonnalagadda #SVCC37 #JackTheMovie pic.twitter.com/ym4D5M0Jup
ఈ సినిమాతో పాటు సిద్దూ డెబ్యూ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' చిత్రం చేస్తున్నాడు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి