/rtv/media/media_files/2025/10/12/shah-rukh-khan-2025-10-12-19-30-39.jpg)
Shah Rukh Khan
Shah Rukh Khan: 70వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక(film-fare-awards 2025) గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ తారలు, ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ అవార్డు వేడుకకు బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. అలాగే షారుఖ్, కృతి సనన్, కాజోల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో అలరించారు.
Also Read : కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!
షారుఖ్ వైరల్ వీడియో
అయితే ఈ వేడుకలో షారుఖ్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన స్టార్ డమ్, హోదా ఇవేవీ పట్టించుకోకుండా ఆయన ప్రవర్తించిన తీరు అభిమానులను ఫిదా చేశాయి. నటి నితాన్షి గోయెల్ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ పైకి వస్తుండగా.. ఆమె డ్రెస్ కారణంగా స్టెప్స్ ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన షారుఖ్.. వెంటనే నితాన్షి దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకొని హెల్ప్ చేశారు. అంతేకాదు ఆమె పొడవాటి ఫ్రాక్ ను తన చేతిలో పట్టుకొని స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఒక స్టార్ అయినప్పటికీ.. ఎలాంటి గర్వం లేకుండా ఒక చిన్న నటికి షారుఖ్ సహాయం చేసిన విధానం అభిమానులను ఫిదా చేసింది. ''షారుక్ ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. గౌరవం, దయ కలిగిన వ్యక్తి. మహిళలను ఆయన గౌరవించే విధానానికి ఫిదా! షారుక్ నిజమైన జెంటిల్మెన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
SRK isn’t just a superstar, he’s pure dignity, kindness and elegance. We love him not only for his work but for the way he carries himself and respects women. He’s the reel and real gentleman others should learn from.💯❤️@iamsrk#FilmfareAwards2025pic.twitter.com/kx53C7tT4K
— Ruhi (@Ruhi_SRKGIRL) October 12, 2025
నటి నితాన్షి గోయెల్ 'లాపతా లేడీస్' చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ కేటగిరీలో ఫిల్మ్ ఫేయిర్ అవార్డు సొంతం చేసుకుంది. నితాన్షి హిందీలో నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో నితాన్షి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమాలో కూడా నితాన్షి ఓ కీలక పాత్రలో నటించింది.