70th FilmFare Awards 2025: ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘లాపతా లేడీస్‌’.. ఉత్తమ నటిగా అలియా!

70వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డుల వేడుక అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ‘లాపతా లేడీస్‌’ చిత్రం ఏకంగా 13 కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకొని సత్తా చాటింది.

New Update
70th FilmFare Awards 2025

70th FilmFare Awards 2025

70th FilmFare Awards 2025:  70వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డుల వేడుక అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో 'లాపతా లేడీస్'' చిత్రానికి అవార్డుల పంట పండింది. ఏకంగా 13 కేటగిరీల్లో ఈ చిత్రం ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఒకే సినిమా ఇన్ని కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకోవడం అరుదైన రికార్డ్. గతంలో 'గల్లీ బాయ్' సినిమా  ఇలాంటి రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ వేడుకకు షారుక్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. షారుఖ్ ఖాన్, కృతి సనన్, కాజోల్ వంటి స్టార్స్  డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో అలరించారు.

Also Read :  ఫుల్ స్వింగ్ లో పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మ్యూజిక్ కోసం ఆస్కార్ విన్నర్ రంగంలోకి!

'లాపతా లేడీస్' ఎంపికైన విభాగాలు 

  • ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్
  • బెస్ట్ డైరెక్టర్:  (లాపతా లేడీస్)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్:  రవి కిషన్ (లాపతా లేడీస్)
  • ఉత్తమ సహాయ నటి: ఛాయా కదమ్ (లాపతా లేడీస్)
  • బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్:  నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణలు, ఉత్తమ సంగీత ఆల్బమ్ వంటి సాంకేతిక విభాగాల్లో కూడా కూడా  'లాపతా లేడీస్‌' చిత్రానికి అవార్డులు   దక్కాయి.

ఉత్తమ నటిగా అలియా 

గతేడాది విడుదలైన ‘జిగ్రా’ సినిమాకు గానూ అలియా భట్(alia-bhatt) ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.  'ఐ వాంట్‌ టు టాక్‌', 'చందు: ఛాంపియన్‌' చిత్రాలకు గానూ అభిషేక్‌ బచ్చన్‌, కార్తిక్ ఆర్యన్ ఫిల్మ్ ఫెయిర్ ఉత్తమ నటుడి  పురష్కారాలను సొంతం చేసుకున్నారు.  

  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్:  కునాల్ ఖేము ('మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్' సినిమాకు), 
    ఆదిత్య సుహాస్ జంభాలే ('ఆర్టికల్ 370' సినిమాకు)
  • బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్ ): అరిజిత్ సింగ్ ('లాపతా లేడీస్' సినిమాలోని 'సజినీ' పాటకి)
  • బెస్ట్ యాక్షన్: 'కిల్' సినిమాకు 
  • Lifetime Achievement Award: ప్రముఖ నటి జీనత్ అమన్,  దివంగత దర్శకుడు శ్యామ్ బెనెగల్ కు వరించింది. 

క్రిటిక్స్  అవార్డ్స్ 

  • బెస్ట్ యాక్టర్  (క్రిటిక్స్): రాజ్‌కుమార్ రావు ('శ్రీకాంత్' మూవీ )
  • బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): ప్రతిభా రాంటా ('లాపతా లేడీస్' సినిమాకు)
  • బెస్ట్ ఫిల్మ్  (క్రిటిక్స్): 'ఐ వాంట్ టు టాక్' (దర్శకుడు షూజిత్ సర్కార్)

Also Read :  కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!

Advertisment
తాజా కథనాలు