KATTALAN: కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!

'మార్కో'  లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మలయాళ ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్  మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'RDX' ఫేమ్ మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ హీరోగా  'కట్టలన్' సినిమాను తెరకెక్కిస్తోంది.

New Update
kattalan movie poster

kattalan movie poster

KATTALAN: 'మార్కో'  లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మలయాళ ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్  మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'RDX' ఫేమ్ మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ హీరోగా  'కట్టలన్' సినిమా(kattalan movie)ను తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

ఫస్ట్ లుక్ పోస్టర్ 

ఈరోజు హీరో ఆంటోనీ వర్గీస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో హీరో లుక్  రక్తంతో తడిచిన మొహంతో, సిగరెట్ తాగుతూ చాలా ఇంటెన్స్ గా కనిపించింది. ''అత్యంత క్రూరులు మాత్రమే బతికి బట్టకట్టగలరు'' అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ షేర్ చేశారు. దీంతో సినిమాలో  వైలెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుస్తోంది. అంతేకాదు ఈ ట్యాగ్ లైన్ ప్రేక్షకుల్లో  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

Also Read: Puri sethupathi: ఫుల్ స్వింగ్ లో పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మ్యూజిక్ కోసం ఆస్కార్ విన్నర్ రంగంలోకి!

Advertisment
తాజా కథనాలు