Sankranthiki Vasthunam ott update
Sankranthiki Vasthunam: అనిల్ రావిపూడి - విక్టరీ వెంకటేష్ కాంబోలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని సైతం ఆకర్షించింది ఈ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 50 కోట్లతో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.300కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇందులో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. సాయి కుమార్, వీటీ గణేష్, శ్రీనివాస్ అవసరాల, ప్రిథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Samantha: ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత
Evandoi! Vaallu vastunnaru!
— ZEE5 Telugu (@ZEE5Telugu) February 20, 2025
Marinni vivaralu, kuusantha chamatkaram kosam vechi chudandi🙏🏼#2025BlockBuster #ComingSoon #ZEE5 #Zee5Telugu pic.twitter.com/K8sTACXngn
త్వరలో ఓటీటీలో
అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులను అదిరిపోయే అప్డేట్ పంచుకున్నారు. త్వరలోనే ఓటీటీలో రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 ”ఏమండోయ్.. వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి. సంక్రాంతికి వస్తున్నాం కమింగ్ సూన్ అంటూ ఓ సరదా పోస్టర్ పంచుకుంది. దీంతో త్వరలోనే ఓటీటీ డేట్‌ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది.
Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?