Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి మరో బంపర్ సర్‌ప్రైజ్

డైరెక్టర్ అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీవీ ప్రీమియర్స్ లో థియేటర్లో డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా యాడ్ చేయనున్నారట. మార్చి 1న జీ తెలుగు ఛానెల్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రీమియర్ కానుంది.

New Update
Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam:  F1,F2 తర్వాత  'సంక్రాంతికి వస్తున్నాం' తో హ్యాట్రిక్ హిట్ కొట్టారు వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అతితక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన  'సంక్రాంతికి వస్తున్నాం' రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకీమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పటివరకు వెంకటేష్ నటించిన చిత్రాల్లో..  రూ.132 కోట్లతో 'ఎఫ్‌2' అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ఉండగా.. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. 

Also Read:Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

డిలీటెడ్ సీన్స్ కూడా.. 

ఇది ఇలా ఉంటే  'సంక్రాంతికి వస్తున్నాం' అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి 1న జీ తెలుగులో ప్రీమియర్ కాబోతున్న ఈ చిత్రంలో.. థియేటర్ లో డిలీట్ చేసిన సన్నివేశాలు కూడా యాడ్ చేయనున్నారట. దీంతో ఆడియన్స్ మరింత ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ చేబోతున్నట్లు తెలుస్తోంది. SVS బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ, సాయి కుమార్, నరేష్, VT గణేష్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read:This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

Also Read:Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

Advertisment