/rtv/media/media_files/2025/08/31/raja-saab-vs-chiru-2025-08-31-07-33-11.jpg)
Raja Saab vs Chiru
Sankranthi Movies: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే ఒక్క పండుగ మాత్రమే కాదు, సినిమా హంగామా కూడా. ప్రతి ఏడాది ఈ సీజన్‌కి పెద్ద పెద్ద సినిమాలు విడుదల(Sankranthi Releases Telugu) అవుతుంటే, ఈసారి మాత్రం ఆ జోరు మరింత పెరగనుంది. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ‘ది రాజా సాబ్’(The Raja Saab) సినిమా, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకరవర ప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) సినిమాలు ఒకే రోజు బరిలో దిగుతున్నాయి!
ఇక ప్రభాస్ సినిమాకోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదట డిసెంబర్ 5, 2025న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, ఇప్పుడు మేకర్స్ అది మార్చి సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తేజ సజ్జ ‘మిరాయి’ ట్రైలర్(Mirai Trailer) లాంచ్ ఈవెంట్‌లో స్వయంగా చెప్పారు. ఇలా ‘ది రాజా సాబ్’ సంక్రాంతి రిలీజ్‌గా మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.
Also Read:ఇదేం ట్విస్ట్ 'రాజా సాబ్'.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా.. !
ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తునట్టు తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాతగా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుండగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కల్కి 2898 ఎ.డి’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!
చిరు vs రాజాసాబ్..
అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ మూవీకి కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా, సూపర్ హిట్ కాంబో అయిన చిరంజీవి - నయనతార మళ్లీ ఈ సినిమాతో కలవనున్నారు. వెంకటేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయిన ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో పనిచేస్తున్నారు.
ఈ సినిమా మ్యూజిక్‌కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read:పండుగ స్పెషల్ 'మన శంకర వరప్రసాద్ గారు' పోస్టర్ చూశారా.. అదిరిపోయింది!
ఇక ప్రభాస్ సినిమా పై తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై IV ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ రూ. 218 కోట్ల పెట్టుబడులకు సంబందించిన అంశంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఇది రిలీజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
ఈ రెండు భారీ సినిమాలు(Prabhas vs Chiranjeevi 2026) ఒకే సీజన్‌లో రావడం తెలుగు ఆడియన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోవైపు మాస్ మెంటర్ చిరంజీవి వీరి మధ్య బాక్సాఫీస్ పోటీ హీట్ పుట్టిస్తోంది. ఈ సారి థియేటర్లలో పండగ వాతావరణం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:''బ్లడీ బెంచ్ మార్క్''.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్!
ఈ సంక్రాంతి 2026, థియేటర్లలో రికార్డుల వర్షం కురవబోతోందని సినీ అభిమానులు, టాలీవుడ్ ఇండస్ట్రీ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక చూడాలి... రెండింటిలో ఏ హీరో సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో!