MEGA 158: ''బ్లడీ బెంచ్ మార్క్''.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో  మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రకటించారు.

New Update
MEGA 158

MEGA 158

MEGA 158: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలు పూర్తయినా.. ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు! 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే  'మన శంకరువరప్రసాద్', 'విశ్వంభర' సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో  మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

మరోసారి మాస్ కాంబో 

'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రకటించారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లోహిత్ కె.,  వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు మూవీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో  'రక్తపు మరకలతో' ఉన్న గొడ్డలి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.  అంతేకాదు పోస్టర్ పై  ''బ్లడీ బెంచ్ మార్క్'' అని రాశారు. ఇది చూస్తుంటే.. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.  'వాల్తేరు వీరయ్య'  సూపర్ హిట్ తర్వాత  మెగాస్టార్- బాబీ మాస్ కాంబో మరో సారి కలవడం ఫ్యాన్స్ లో  అంచనాలను పెంచుతోంది.  దీంతో పాటు మెగాస్టార్ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో #చిరుఓదెలా ప్రాజెక్ట్ కూడా సైన్ చేశారు.

ఇదిలా ఉంటే..తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు చిరంజీవి అసలు పేరునే టైటిల్ గా పెట్టారు. 'మన శంకర వరప్రసాద్ ' అని ప్రకటించారు. టైటిల్ అనౌన్స్ తో పాటు చిన్న గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఇందులో మెగాస్టార్ స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. అలాగే సిగరెట్ వెలిగిస్తూ తన మార్క్ స్టైల్ లో వాక్ చేస్తూ రావడం వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుచేసింది. గ్లింప్స్ వీడియో చూస్తుంటే మెగాస్టార్ ఈ సినిమాలో ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి 'మన శంకర వరప్రసాద్' కామెడీ, ఫన్,యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది.

ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత మెగాస్టార్, నయన్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Mirai Making Video: అదరగొడుతున్న 'మిరాయి' మేకింగ్ వీడియో.. తేజ సజ్జ యాక్షన్ గూస్ బంప్స్

Advertisment
తాజా కథనాలు